Nandyala: కలకలం రేపుతున్న పోలీసుల మార్ఫింగ్ ఫొటోలు.. వీటి వెనుక ఆ రాజకీయ నేత హస్తం?

నంద్యాలలో కొంతమంది పోలీస్ అధికారుల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్‌ చేశారు. ఈ మార్ఫింగ్‌ చేసిన ఫోటోలలో పోలీసులు మహిళల వేషధారణలో ఉన్నారు. ఈ ఫోటోలను Shiva412668 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
morphing photos

morphing photos

టెక్నాలజీ(Technology) మారినప్పటి నుంచి కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరి ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా నంద్యాల జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా(nandyala) లోని కోవెలకుంట్ల, సంజామల స్టేషన్లలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్‌ చేశారు. ఈ మార్ఫింగ్‌ చేసిన ఫోటోలలో పోలీసులు మహిళల వేషధారణలో ఉన్నారు. ఈ ఫోటోలను Shiva412668 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశారు.

ఇది కూడా చూడండి:  చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీటీడీ ఈవోపై బదిలీ వేటు.. కారణమిదేనా?

ఫొటోలు మార్ఫింగ్ చేసి..

కోవెలకుంట్ల సీఐ, ఎస్ఐలతో పాటు సంజామల ఎస్ఐల ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. అయితే మార్ఫింగ్ చేసిన ఈ ఫొటోలను ఆగస్టు 27 వరకు అప్‌లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ ఫొటోలు పోలీసులను కించపరిచే విధంగా ఉండటంతో పాటు వారి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయి. దీంతో పోలీసులు సీరియస్ అయి కేసు నమోదు చేశారు. ఫొటోలు ఎవరు మార్ఫింగ్ చేశారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  మామకు పోటీగా అల్లుడు.. రాజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

ఈ మార్ఫింగ్‌ ఫోటో(morphing photos) ల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటన వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలకు, పోలీసులకు మధ్య విభేదాలు ఉండటం వల్ల ఇలాంటి పనులు చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫోటోలను ఎవరు పోస్ట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారు, దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు