Viral video: మరో అమ్మాయితో అడ్డంగా బుక్కైన ప్రియుడు.. రోడ్డుమీద పండపెట్టి తొక్కిన యువతి: వీడియో!

బెంగళూర్‌లో ఓ ప్రేమజంట వ్యవహారం వైరల్‌గా మారింది. ప్రియుడు మరో అమ్మాయితో హోటల్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న యువతి అతన్ని రోడ్డుమీద పరిగెత్తించి కొట్టింది. బట్టలు చింపి పండపెట్టి తొక్కింది. వీడియో వైరల్ అవుతుండగా యువతికి భారీ మద్దతు లభిస్తుంది. 

New Update
karnataka viral

karnataka viral Photograph: (karnataka viral)

Viral video: బెంగళూర్‌లో ఓ ప్రేమజంట వ్యవహారం వైరల్‌గా మారింది. ప్రియుడి మరో అమ్మాయితో హోటల్లో రాసలీలు చేస్తుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న యువతి అతన్ని నడిరోడ్డుమీద పరిగెత్తించి కొట్టింది. బట్టలు చించి పండపెట్టి తొక్కింది. ఈ వీడియో వైరల్ అవుతుండగా యుతికి భారీ మద్దతు లభిస్తుంది. 

Also Read: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత

అయితే ఆ యువతి కొంతకాలంగా ప్రియుడిపట్ల అనుమానం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. దీంతో అతనిపై నిఘా పెట్టిన అమ్మాయి.. తన స్నేహితులకు కనిపెట్టాలని చెప్పింది. ఈ క్రమంలోనే అతని కదలికలను కనిపెడుతుండగా ఇటీవల మరో అమ్మాయితో రహస్యంగా హోటల్ గదికి వెళ్లి రాసలీలల్లో మునిగితేలాడు. ఇది గమనించిన సదరు యువతి.. తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లి వారున్న గది తలుపులు మూసివేసింది. 

మరికొంతమంది సహాయంతో అతన్ని పట్టుకుని చితకబాదింది. అతను అక్కడినుంచి పరిగెత్తుంటే.. రోడ్డుమీద వెంటపడి కొట్టింది. బట్టలు చినిగినా వదలకుండా దాడి చేసింది. వద్దు నన్ను వదిలేయ్ అంటూ అతను దండంపెట్టినా వినకుండా ఆగ్రహంతో ఊగిపోయింది. అందరూ చూస్తుండగానే రోడ్డు మీద పండపెట్టి తొక్కింది. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. 

bengalore | lovers | fight | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు