చనిపోయిన వాళ్లంతా పెళ్లిలో ప్రత్యక్షం.. బంధువులు షాక్..! (VIDEO)

ఏఐ టెక్నాలజీతో కొత్త రకం వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యులను ఫంక్షన్‌ వీడియోలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. వేడుకకు వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అవుతున్నారు. స్వర్గం నుంచి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు క్రియేట్ చేస్తున్నారు.

New Update
Ai generated video

జీవితానికి ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి. పిల్లికి బిక్షం పెట్టని వాడు కూడా పెళ్లికి కోట్లు పెట్టి అంగరంగ వైభవంగా విహహం చేసుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. అయితే అలాంటి పెళ్లిలో మనకు దూరమైన దగ్గరి వ్యక్తుల లోటు బాగా ఉంటుంది. తాత, తండ్రి, అమ్మ, అమ్మమ్మ, తమ్ముడు, చెల్లి, ఇలా ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. పెళ్లిలో వారు లేని లోటు బాగా కనిపిస్తోంది. ఆ బాదను దూరం చేసి.. దగ్గర వాళ్లను పెళ్లిలో కళ్లకు కట్టినట్లు చూపించేందుకు టెక్నాలజీ వాడుతున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్న ఏఐ టెక్నాలజీతో చనిపోయిన వారిని సైతం వేడుకల్లో ప్రత్యక్షమైయ్యేలా చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెల్లో పెళ్లి ముహూర్తాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ పెళ్లిల్లో ఓ కొత్త రకం ట్రెండ్ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Also read : Flights: మూలిగే నక్క మీద తాటి పండు..పాకిస్తాన్ ను వద్దంటున్న విదేశాలు

పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్‌లో ఏఐ టెక్నాలజీ వాడి లేని వ్యక్తులను వీడియోలో క్రియేట్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల ఫొటోలతో యానిమేటెడ్ వీడియోలు సృష్టిస్తున్నారు. ప్రి వెడ్డింగ్ షూట్, ఫంక్షన్ వీడియో షూటింగ్‌లో వారు ఉన్నట్లే చిత్రీకరిస్తున్నారు. చనిపోయిన వాళ్లు స్వయంగా సర్గం నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొన్నట్లు వీడియో క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్‌‌ అందరిని షాక్‌కు గురి చేస్తోంది. వచ్చిన బంధువులు ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు. కుటుంబసభ్యులు మాత్రం చనిపోయిన వారి జ్ఞాపకాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Also read :  Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!

అయితే టెక్నాలజీని వాడి లేనివాళ్లును ఉన్నట్లుగా చూపించి వీడియో గ్రాఫర్లు ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ తరహా ఏఐ వీడియోలకు ఇటీవల బాగా డిమాండ్ పెరింగింది. ఇలా వీడియోగ్రఫి తీయించుకోడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

(ai-technology | wedding videos | photoshoot | marriage | videography | trending | trending videos | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు