/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/varun-1-jpg.webp)
Varun Tej - Lavanya Pre Wedding Celebrations: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం చిరంజీవి (Chiranjeevi) నివాసంలో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. సందడి సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ కొత్త జంటకు అభినందనలు తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లలో లావణ్య త్రిపాఠిని కోడలిగా కుటుంబ సభ్యులకు చిరు పరిచయం చేసినట్టు ఆయన ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అందమైన ఫొటోలు కూడా షేర్ చేశారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఫ్యామిలీస్ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లకు అటెండ్ అయ్యారు. రామ్ చరణ్ (Ram charan) - ఉపాసన దంపతులతో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, నిహారిక తదితరులను ఈ ఫొటోల్లో చూడవచ్చు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటకు ఈ ఏడాది జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు, చిరంజీవి, అల్లు అరవింద్ సహా కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే పాల్గొన్నారు. నెక్ట్స్ మంత్ అంటే నవంబర్ లో వరుణ్, లావణ్యల పెళ్ళి జరగనుంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని చెబుతున్నారు.
View this post on Instagram
Follow Us