ఆ స్టార్ ఇంట్లో వరుణ్, లావణ్య ప్రీవెడ్డింగ్ పార్టీ..సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!!
‘థాంక్యూ బన్నీ, స్నేహ అక్కా’ అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హీరో వరుణ్ ఈ ఇద్దరికి మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు థ్యాంక్స్ చెప్పారో అని అనుకుంటున్నరా? .. రిసెంట్ గా అల్లు అర్జున్ దంపతులు కూడా వరుణ్, లావణ్య కోసం మరో ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. సో అందుకోసం అల్లు అర్జున్ కు థాంక్స్ చెబుతూ పోస్ట్ చేశారు హీరో వరుణ్ తేజ్. ఈ పార్టీలో మెగా-అల్లు కుటుంబసభ్యులతో పాటూ హీరో నితిన్, ఆయన భార్య షాలిని, నటి రీతూ వర్మ వంటి ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు.