USA Tourist Visa: టూరిస్ట్ వీసాల ఎదరుచూపులకు తెరపడనుంది. ఇక మీదట టూరిస్ట్ వీసాలు తొందరగా వస్తాయని చెబుతోంది అమెరికా ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేక వెసులుబాటు కూడా కల్పించింది. ఇకపై దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ వీటంన్నిటికీ సెంటర్ అవనుంది. ఢిల్లీ కార్యాలయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇకహైదరాబాద్ , చెన్నై, ముంబయ్, కోలకత్తాల్లోకూడా పరిమిత వీసా స్లాట్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పింది. వీసా ఇంటర్వూలు అవసరమైన వారు మాత్రమే ఢిల్లీ వెళ్ళాల్సి ఉంటుంది.
రెన్యువల్‌కు డ్రాప్ బాక్స్...
అయితే ఇంతకు ముందే వీసా ఉండి దాన్ని రెన్యువల్ చేయించుకోవాలనుకునే వారు మాత్రం ఢిల్లీ వెళ్ళక్కర్లేదు. వాళ్ళు ఇంటర్వ్యూ లేకుండానే వీసా పొందవచ్చును. వీసా కాలపరిమితి 12 నెలలు మించని వారు ఇంటర్వ్యూ లేకుండా వీసా పొందవచ్చును. వాళ్లు బ్రాప్ బాక్స్ ద్వారా వీసా పొందవచ్చును. ఇక్కడ మరో అదనపు ప్రయోజనం కూడా కల్పించింది అమెరికా ప్రభుత్వం. కోవిడ్ కారణంగా టూరిస్ట్ వీసాల జాబితా బాగా పెరిగిపోయింది. దీంతో వీసా గడువు తీరి 48 నెలల వరకు కూడా ఇంటర్య్యూ లేకుండా కొత్త వీసా జారీ చేసేలా వెసులుబాటు కల్పించింది.
ఆరు కేంద్రాల్లో...
ప్రస్తుతం అమెరికా రాయబార కార్యాలయం, నాలుగు కాన్సులేట్ కార్యాలయాల్లో డ్రాప్‌బాక్స్ సదుపాయం ద్వారా ఇంటర్వ్యూ మినహాయింపు వీసా దరఖాసులను ఉచితంగా ఇవ్వొచ్చు. వీటితో పాటూ మరో ఆరు డాక్యుమెంట్ డ్రాపాఫ్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. బెంగళూరు, పుణె, అహ్‌మదాబాద్, చంఢీగడ్, జలంధర్, కొచ్చిన్‌లలోని వీసా కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చును. దీని కోసం కేవలం 850 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
Also Read:Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్