Israel-Hamas News: ప్రస్తుతం గాజాలో ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) తెలిపారు. ఆయన ప్రకటనపై ఇంకా హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న ఖతర్ రాజధాని దోహా లేదా ఈజిప్టు రాజధాని కైరోలో (Cairo) చర్చలు జరిగే అవకాశముందని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలైన అమెరాక, ఈజిప్టు, ఖతార్ తెలిపాయి. అయితే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపేందుకు హమాస్ ముందుకు వస్తుందా రాదా అనే దానిపై స్పష్టత లేదు.
Also Read: చెస్ ఛాంపియన్ షిప్ లో గెలిచేందుకు విషప్రయోగం చేసిన క్రీడాకారిణి..రికార్డయిన సీసీటీవి దృశ్యాలు!
ఇదిలాఉండగా.. 2023 అక్టోబర్ 7న గాజాలో ఉండే తీవ్రవాద సంస్థ హమాస్.. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తర్వాత హమాస్ తీవ్రవాదులను అంతచేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికీ అక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ పాటించేందుకు తమ దేశం నుంచి బంధీలుగా తీసుకెళ్లినవారిని హమాస్ విడిపించాలంటూ ఇజ్రాయెల్ కండిషన్ పెట్డింది.
Also Read: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీలలో బాంబు దాడులు ప్లాన్ చేసిన ISIS ఉగ్రవాదులు!