Telangana Assembly: ఈ రోజు గవర్నర్ ప్రసంగంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చర్చ మొదలైన కాసేపటికే ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. గవర్నర్ ప్రసంగం ఎలా ఉందంటే కష్టం ఒకడిది పేరు ఒకరిది అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగాన్ని ఆయన ఖండించారు.
ఇదిలా ఉండగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పని చేయాలని అన్నారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తాం అని అసెంబ్లీలో పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చాయి. బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయిందని అన్నారు. ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.
ALSO READ: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ
గవర్నర్ కాంగ్రెస్ హామీలను చదివారు: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోను అసెంబ్లీలో చదువుతున్నట్లు ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటగా ప్రతిరోజు ప్రజావాణి ఉంటుందని చెప్పి ఇప్పుడు వారంలో రెండు రోజులే అని అంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను చూపించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ఉంటే సహంచేది లేదని తేల్చి చెప్పారు. హామీలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మొత్తం 412 హామీలు ఇచ్చారని అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆరు హామీల గురించే మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఏదైతే హామీలు చెప్పారో అవి అన్ని అమలు చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా గొంతుక అయ్యి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ALSO READ: హైదరాబాద్‌కి సింహం లాంటి కుక్క.. ధర రూ.20 కోట్లు..!