ఎన్టీఆర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లాలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. 

New Update
hyd fire accident

Fire accident

ఎన్టీఆర్ జిల్లాలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలోని మిర్చి శీతల గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో మిర్చి నిల్వలు అన్ని కూడా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే మంటలను అదుపు చేశారు.  అయితే ఎంత వరకు నష్టం జరిగింది? ఎలా అగ్ని ప్రమాదం సంభవించిదనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాద సమయంలో శీతల గిడ్డంగిలో సుమారు రూ.12 కోట్ల విలువైన మిర్చి ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి:వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!

ఉద్యోగం పోయిందని మనస్తాపంతో..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో ఏపీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడకు చెందిన  కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది.  అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు.  

అభిషేక్ ఆత్మహత్యతో గుడివాడలో ఉన్న అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.  మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే సోదరుడి మరణానికి కారణమని అరవింద్‌ తెలిపాడు. ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యి.. మనస్తాపం చెందినట్లు సోదరుడు తెలిపాడు. 

ఇది కూడా చూడండి:Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!

ఇది కూడా చూడండి:AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!

Advertisment
తాజా కథనాలు