/rtv/media/media_files/2025/03/24/WiwVmVj9j65VvHrgDU6t.jpg)
అమెరికాలో ఏపీకి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడికి ఏడాది క్రితమే పెళ్లి అయింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. అయితే ఆరు నెలల నుంచిఉద్యోగం లేకపోవడం.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆంక్షల మనస్థాపంతో కొల్లి అభిషేక్ ఆత్మహత్య పాల్పడ్డాడు.
మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి
అభిషేక్ ఆత్మహత్యతో గుడివాడలో ఉన్న అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి దాతలు సాయానికి ముందుకు రావాలని గోఫండ్‌మీ ద్వారా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే సోదరుడి మరణానికి కారణమని అరవింద్ తెలిపాడు.
Also read : కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన అతియా శెట్టి