/rtv/media/media_files/2025/03/24/pcF5iOTivU1OjaquzkEb.jpg)
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ సాగింది. ఫైనల్ గా ఒక వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరగులతో బరిలో దిగిన ఢిల్లీ జట్టకు మొదట్లోనే బిగ్ షాక్ తగిలింది. ఫస్ట్ ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 0.3 ఓవర్‌కు జేక్ ఫ్రేజర్ (1) బదోనికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తరువాత కాసేపటికే అభిషేక్ పొరెల్ (0) ఔట్ కాగా.. మణిమారన్ సిద్ధార్థ్ వేసిన 1.4 ఓవర్‌కు సమీర్ రిజ్వీ (4) పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండు ఓవర్లకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.
WHAT A FEARLESS KNOCK.🔥THIS MATCH WILL BE REMEMBERED FOR A LONG TIME.✨ #LSGvDC#DCvLSG#AshutoshSharmapic.twitter.com/DWVHvT09JT
— Manzar B (@ManzarBwrites) March 24, 2025
ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు
ఆ టైమ్ లో అక్షర్ పటేల్ (22), డుప్లెసిస్ (29) జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు. అయితే దూకుడుగా ఆడుతున్న అక్షర్ పటేల్.. 5.3 ఓవర్‌లో దిగ్వేశ్ రాఠీ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే 6.4 ఓవర్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డుప్లెసిస్ (29)కూడా ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 66 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు అశుతోష్ శర్మ (66*).. అతనికి ట్రిస్టన్ స్టబ్స్ (34) తోడు కావడంతో ఢిల్లీ స్కోరు పుంజుకుంది. దీంతో ఆట రసవత్తరంగా మారింది. ఇద్దరు బౌండరీలు బాదుతూ జట్టును ముందుకు నడిపించారు. అయితే సిద్ధార్థ్ వేసిన 13 ఓవర్‌లో వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదిన ట్రిస్టన్ స్టబ్స్ తర్వాతి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ తరువాత వచ్చిన విప్రజ్ నిగమ్ (39) కూడా చెలరేగిపోయి ఆడాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దూకుడుగా ఆడుతున్న విప్రజ్ నిగమ్.. దిగ్వేశ్ వేసిన 16.1 ఓవర్‌కు సిద్ధార్థ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన మిచెల్ స్టార్క్ (2), కుల్‌దీప్ (5), త్వరత్వరగానే ఔటయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. ప్రిన్స్ యాదవ్ వేసిన 19 ఓవర్‌లో చివరి మూడు బంతులకు అశుతోశ్ వరుసగా 2,6,4 బాదేశాడు. దీంతో చివరి ఓవర్లో జట్టుకు ఆరు పరుగులు అవసరం అయిన సమయంలో అశుతోశ్ సిక్సర్ గా బాది జట్టును గెలిపించాడు.
Also read : Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!