యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం.. 13 మంది స్పాట్

తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

New Update
V BREAKING

hyd

తెలంగాణలోని యాదగిరి గుట్టలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి రెండు బస్సులు ఢీకొన్నాయి. చౌటుప్పల్ మండలంలో ఈ ప్రమాదం జరగ్గా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఒక్కసారిగా వెనుక నుంచి ఎలా ఢీకొన్నాయనే విషయం తెలియదు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

సూర్యాపేట జిల్లాలో..

ఇదిలా ఉండగా ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్, బొజ్జగూడ తండా సమీపంలో నీళ్ల ట్యాంకర్‌ను ఇన్నోవా కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మేళ్లచెరువు మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ, ఉపేందర్ రెడ్డి, బ్రహ్మారెడ్డి నలుగురు పని కోసం ఖమ్మం వెళ్లి కోదాడకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం కోదాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జరుగుతున్న పనులలో వాటర్ ట్యాంకర్‌తో మొక్కలకు నీళ్లను కొడుతున్నారు. 

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

ఒక్కసారిగా ట్యాంకర్‌ ముందుకు మూవ్ ఇవ్వడంతో వెనక నుండి కారు వచ్చి ఢీకొనట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. దీంతో అక్కడికక్కడే సోము కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మ మృతి చెందారని.. ఉపేందర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డికి తీవ్రంగా గాయాలయ్యాని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరిది తప్పు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు