USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్..

అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్‌లోని మాసీ మాల్‌లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు.

New Update
USA: అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతుల అరెస్ట్..

ఇండియాలో చాల్లేదన్నట్టు అమరికాలో కూడా దొంగతనాలు మొదలుపెట్టారు. అమెరికా ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ ఇక్కడకు వచ్చాక దొంగతనాలకు మాత్రం బాగామరిగారు. ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. బెయిల్ మంజూరై బయటకు వచ్చాక మళ్లీ దొంగబుద్ధి చూపించారు. డాలస్‌లోని మాసీ మాల్‌లో డబ్బులు చెల్లించకుండా పరార్ అయ్యారు.

publive-image

కారం రవీందర్ రెడ్డి కూతురు కారం మానస రెడ్డి, పులియల జితేందర్ రెడ్డి కుమార్తె సింధూజారెడ్డి అమెరికాలో చదువుతున్నారు. వీరిలో ఒకరైన మానసరెడ్డి గతంలో పలు దొంగతనాలకు పాల్పడి బెయిల్ మంజూరైనప్పటికీ మళ్లీ దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తుంది. ఇదే తరహాలో ఏప్రిల్ నెలలో ఓ స్టోర్ లో భవ్య లింగనగుంట (20), యామిని వల్కలపుడి (22) అనే ఇద్దరు యువతులు వస్తువులు తీసుకుని డబ్బులు చెల్లించకుండా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Also Read:UGC-NET: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు