Watch Video : జాతరలో కలకలం.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఏనుగులు

కేరళలోని త్రిస్సూర్ జిల్లా తరక్కల్‌లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవ ముగింపు జాతరలో రెండు ఏనుగులు కొట్లాడుకొని అలజడి సృష్టించాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. కొంతమంది గాయాలపాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.

New Update
Watch Video : జాతరలో కలకలం.. పొట్టుపొట్టు కొట్టుకున్న ఏనుగులు

Two Elephants Fight : కేరళ(Kerala) లోని త్రిస్సూర్ జిల్లా తరక్కల్‌లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవ ముగింపు జాతర(Jatara) లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగులు ఒకదానికొకటి పోట్లాడుకోవడం(Two Elephants Fight) తో.. ఒక్కసారిగా జారతరో అల్లకల్లోలం జరిగింది. జనాలు ఉరుకులు, పరుగులు పెట్టారు. దీంతో ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి జాతర ముంగింపు ఉత్సవంలో భాగంగా రెండు ఏనుగులపై అమ్మవారిని ఊరేగిస్తున్నారు.

Also Read : కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి..

ఈ క్రమంలో ఒక్కసారిగా ఓ ఏనుగు అలజడి సృష్టించి మావటి మీద మూడు సార్లు దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆయన స్వల్ప గాయాలతో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఊరేగింపు కోసం తీసుకొచ్చిన మరో ఏనుగుపై కూడా దాడి చేసింది. దీంతో ఈ రెండు గజరాజులు ఒకదానికొకటి కొట్లాడుకున్నాయి. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గజరాజుల మీద ఉన్నవాళ్లు కిందపడి గాయాలపాలయ్యారు.

ఏనుగులు కొట్లాడుకోవడంతో జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో మరికొంతమంది గాయాలయ్యాయి. చివరికి మావటివాళ్లు శ్రమించి ఏనుగుల కొట్లాటను ఆపగలిగారు. అయితే గాయాలపాలైన ఒక ఏనుగులు కిలోమీటర్ దూరం వరకు పరుగులు తీసింది. దీంతో మావటివాళ్లు దాన్ని వెంబడించి పట్టుకున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

Also Read : రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం!

Advertisment
Advertisment
తాజా కథనాలు