PUNJAB : కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి.. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత పంజాబ్ ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు "ఉన్నత స్థాయి" ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. By Durga Rao 23 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Fake Alcohol : పంజాబ్‌లో నకిలీ మద్యం(Fake Alcohol) కేసులో మృతుల సంఖ్య 21కి చేరింది. ఇథనాల్(Ethanol) తో కూడిన మద్యం సేవించి 40 మంది అడ్మిట్ అయ్యారని సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్(Sangrur Chief Medical Officer) తెలిపారు. బుధవారం, మార్చి 20, నలుగురు వ్యక్తులు నకిలీ మద్యం సేవించి మరణించారు . కొందరు ఆసుపత్రి చేరారు. మరుసటి రోజు, పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. , మార్చి 22, శుక్రవారం ఎనిమిది శనివారం రోజు ఐదుగురు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 21 కి చేరుకుంది. నిందితుల(Accused) ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సిట్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. వారిని విచారించగా... ఓ ఇంట్లో విషపూరితమైన మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులకు వారు తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్, ఒక రకమైన విష రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. "ఈ ఘటనలో ఇప్పటివరకు పద్నాలుగు మంది మరణించారు. మేము ఈ కేసులో ఇద్దరిని తాజాగా అరెస్టు చేసాము. దర్యాప్తు కొనసాగుతోంది . దోషులను విడిచిపెట్టేది లేదని" డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లర్ శుక్రవారం వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం(Punjab Government) ఘటనపై విచారణకు "అత్యున్నత" ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.X పై ఒక పోస్ట్‌లో పంజాబ్ పోలీసులు ఇలా అన్నారు, "మొత్తం విషయం వెనుక ఉన్న సంబంధాన్ని వెలికితీసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాము. నలుగురు సభ్యుల SIT ADGP లా & ఆర్డర్ గురీందర్ ధిల్లాన్ IPS నేతృత్వంలో, DIG పాటియాలా రేంజ్ హర్చరణ్ భుల్లర్ IPS, SSP సంగ్రూర్ సర్తాజ్ చాహల్ IPS & అదనపు కమిషనర్ (ఎక్సైజ్) నరేష్ దూబేతో సహా దర్యాప్తులను పర్యవేక్షించారని పేర్కొంది. ఈ కేసులో ప్రమేయమున్నఏ ఒక్కరిని విడిచి పెట్టమని తెలిపారు. Also Read : AP: ఒంటిమిట్ట లో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య! #fake-alcohol #21death #punjab #liquor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి