Watch Video: నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్

ఏపీలోని సత్యసాయి జిల్లాలో వాహనాలు తనిఖీ చేస్తున్న ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ పోట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

New Update
Watch Video: నడిరోడ్డుపై పొట్టుపొట్టు కొట్టుకున్న పోలీసులు.. వీడియో వైరల్

Police Officers Fight in AP: ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సాయంత్రం రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అయితే వాళ్లిద్దరి మధ్య ఏం అయిందో తెలియదు.. కానీ ఒక్కసారిగా రోళ్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన నారాయణ స్వామి నాయక్‌, అగళి పీఎస్‌కు చెందిన శివకుమార్‌ ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు.

Also Read: జగన్ బీజేపీకి దత్తపుత్రుడు.. అందుకే ఇంత వరకూ..

దీంతో మాటామాటా పెరిగి గళ్లలు పట్టుకుని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు కొట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో నెటీజెన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ప్రజలకు సర్దిచెప్పాల్సిన పోలీసులే డ్యూటీలో ఉండగా.. ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: కేఏ పాల్ కొత్త గెటప్.. మత్స్య కారులతో చేపలు పట్టి.. ఏం చేశాడంటే..?

Advertisment
తాజా కథనాలు