కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది?

టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాతే బిల్లుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తమిళిసై(tamilisai) ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తున్నారు. ఈ బిల్లుపై ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు అడిగారు. వాటికి ప్రభుత్వం తక్షణమే సమాధానం చెబితే బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు గవర్నర్ తీరుకు నిరసన ఇవాళ(ఆగస్టు 5) రాజ్‌భవన్‌ని ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

New Update
కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తారా? ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేస్తారా? ఏం జరగబోతోంది?

TSRTC Bill : టీఎస్‌ఆర్టీసీ(TS RTC) బిల్లు ఎపిసోడ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. బిల్లు పరిశీలన, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామని ముందుగా చెప్పిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఇప్పుడు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. సర్కార్‌ నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటామని రాజ్‌భవన్‌(Raj bhavan) వర్గాలు చెప్పాయి. ఇది ఆర్థికపరమైన వ్యవహారం కావడంతో గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇక మరోవైపు గవర్నర్‌ నిర్ణయంపై ఇప్పటికే ఆర్టీసీ కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈ ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు బస్సుల బంద్‌కు పిలుపునిచ్చిన కార్మికులు..గవర్నర్ (Governor) తన నిర్ణయం మార్చుకోకుంటే రాజ్‌భవన్‌ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌ వద్ద నిరసన చేస్తామంటున్నారు.

అటు గవర్నర్‌ కావాలనే ఇలా చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలోనూ పలు బిల్లుపై సంతకం పెట్టలేదని వాదిస్తున్నాయి. ఇంతకముందు తమిళిసై సంతకం చేయని బిల్లులను మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాయి. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ) బిల్లును మంత్రి హరీశ్ రావు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు‌ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ సమావేశాలు రాత్రి 10గంటల 20నిమిషాల వరకు జరగగా.. ఇవాళ ఉదయం 10గంటలకు సభ మళ్లీ ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని స్పీకర్‌ పోచారం స్పష్టం చేశారు. వేరే బిల్లులు సంగతి ఎలా ఉన్నా.. ఆర్టీసీ బిల్లు మాత్రం ఆర్థికపరమైనది కావడంతో తమిళిసై అనుమతి తప్పనిసరి కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ప్రస్తుత ప్రభుత్వానికి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఏం జరుగుతుందోనన్నదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి అసెంబ్లీ నిర్వహించే అవకాశం లేదు. సభ ముగిసేలోపు బిల్లు(TSRTC Bill) విషయంలో గవర్నర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్ లభించకపోతే అసెంబ్లీని మరికొన్ని రోజులు పొడిగించే ఆలోచనలో సర్కార్‌ ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి గతంలోనూ తమిళిసై నాలుగు బిల్లులను వెనక్కి పంపినా ఇంత స్థాయిలో మంటలు రేగడం ఇదే తొలిసారి. 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన విషయం కావడంతో అందరి చూపు ప్రస్తుతం రాజ్‌భవన్‌ వైపే ఉంది. టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2023 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అవుతారు. వారికి ప్రతినెలా జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్లును కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతునిచ్చాయి.

Also Read: కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..!

Advertisment
తాజా కథనాలు