కదలని బస్సులు.. డిపోల వద్దే కొనసాగుతోన్న నిరసనలు.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో..!
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు అంగీకరం చెప్పకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు డిపోల వద్ద ఆందోళనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమిళిసైకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరుకే బస్సులు బంద్ అని చెప్పినా.. ఆ తర్వాత కూడా కొన్ని డిపోల్లో బస్సులు కదలని పరిస్థితి కనిపిస్తుంది.