TS Elections 2023: ఇక కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లోనే ఉంటాడు... ఖర్గే చురకలు!

తెలంగాణ పర్యటనలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయం అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని.. అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీలోనే లేకుండా పోయిందని ఆరోపించారు.

New Update
TS Elections 2023: ఇక కేసీఆర్ ఫామ్‌ హౌస్‌లోనే ఉంటాడు... ఖర్గే చురకలు!

Mallikarjuna Kharge Satires On KCR: తెలంగాణ పర్యటనలో ఉన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను (Congress Manifesto) విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) పై చురకలు అంటించారు. ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారని ఎద్దేవా చేశారు. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటారని అన్నారు.

ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు..

విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమ తొలి లక్ష్యం మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెలా 2500, రూ.500కే గ్యాస్, బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీ అని తెలిపారు.

ALSO READ: ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో

కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్‌ విజయభేరి సభలో పాల్గొన్న మల్లిఖార్జున ఖర్గే బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలపై విమర్శల దాడి చేశారు. తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేకుండా పోయిందని అన్నారు. కేసీఆర్‌కు సహకరించేందుకు బీజేపీ పోటీ నుంచి విరమించుకుందని ఖర్గే ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని పేర్కొన్నారు. అందరి భవిష్యత్‌ను రాసే గొప్ప బాధ్యతను అంబేడ్కర్‌కు ఆనాడు నెహ్రూ అప్పగించారని తెలిపారు. తెలంగాణ ప్రజలందరి పోరాటం చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ ఇవ్వలేదని అన్నారు.

Advertisment
తాజా కథనాలు