Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్‌..మస్క్‌ డ్యాన్స్‌ చూడతరమా!

అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎక్స్‌ ఓనర్‌ ఎలాన్‌ మస్క్‌ నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

New Update
Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్‌..మస్క్‌ డ్యాన్స్‌ చూడతరమా!

Trump-Musk: ఒకరు అగ్ర రాజ్యానికి మాజీ అధ్యక్షుడు...మరోసారి అధ్యక్షుడు అయ్యేందుకు పోటీ పడుతున్న పవర్‌ ఫుల్‌ లీడర్. మరొకరు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. ఇద్దరూ కలిసి ఎక్స్‌ వేదికగా ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ట్రంప్‌ మస్క్‌కి జాబ్‌ ఆఫర్‌ కూడా ఇచ్చాడు. తమ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరాడు.

ఇదంతా ఒక ఎత్తయితే..వీరిద్దరూ కలిసి నడిరోడ్డు మీద డ్యాన్స్ చేయడం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే సూపర్‌ ఉంది కదా.కానీ అది సాధ్యమయ్యే పనా అంటే...ఏఐ పుణ్యమా అని సాధ్యమైయ్యింది. ‘స్టే ఇన్ అలైవ్’ పాటకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అదిరిపోయే స్టెప్పులేసినట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు.

అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను ప్రచారం కోసం ఎలాన్ మస్క్ ఇటీవలే ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలోనే తాజా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది.ఈ వీడియోను తొలిసారిగా అమెరికాలోని ఉటా సెనేటర్ మైక్ లీ ట్వీట్ చేయగా.. ఎలన్ మస్క్ రీట్వీట్ చేశారు.

elon musk

మా డ్యాన్స్ ఎలా ఉందని తన ఫాలోవర్స్ ను సరదాగా మస్క్‌ అడిగాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఏకంగా 6.5 కోట్ల మంది ఈ వీడియోను చూసి.. 3.5 వేల మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియో ఫన్నీగా ఉందని కొందరు వ్యాఖ్యానించగా మరికొందరు విమర్శించారు. ఈ వీడియో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనేక ఓట్లను తెచ్చిపెడుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Also Read: భార్య అందంగా తయారవుతుందని..చంపేసిన భర్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు