Actress Rashmika Mandanna : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను నెల రోజులుగా పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. తనకు చిన్న ప్రమాదం జరగడమేనని పేర్కొంది. ప్రస్తుతం కోలుకుంటున్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటున్నానని, ప్రస్తుతం బాగానే ఉన్నానని చెప్పింది.