నేను ప్రెసిండెంట్‌గా బాధ్యతలు చేపట్టగానే.. కెనడా అమెరికాలో 51వ స్టేట్‌గా కలిసిపోతుందంటూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇటీవల కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం.. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్, కెనడా అమెరికాలో కలిసిపోయినట్లు ఉన్న మ్యాప్ సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేయడం చూస్తుంటే.. కెనడా దేశాన్ని అమెరికా ఆక్రమించుకుంటుందా అని అనుమానాలు కలుగుతున్నాయి. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మంగళవారం ప్రెస్‌మీట్‌లో చేసిన కామెంట్స్ అంతర్జాతీయంగా చర్చనీయాంశమైయ్యాయి. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కెనడాను విలీనం చేసుకోవాలని భావిస్తోన్నానని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ట్రంప్ దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. కెనడా భద్రత దృష్ట్యా అమెరికాలో విలీనం కావడమే మంచిదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు పేర్కొన్నారు. సైనిక చర్యతో కెనడాని అమెరికాలో విలీనం చేస్తుకుంటారని అని ఓ జర్నలిస్ట్ అడిగి ప్రశ్నకు ట్రంప్ నో అని చెప్పాడు. ఎకనమిక్ ఫోర్స్‌తో కెనడాను అమెరికాలో కలుపుకుంటామని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ ఎకనమిక్ ఫోర్స్ అంటే..? ట్రంప్ అన్నది నిజంగా చేస్తాడా..? లేక అది పొలిటికల్ సెటైరా..? ట్రంప్ ప్లాన్ ఏంటో చూద్దాం.. ట్రంప్, ట్రూడో ల మధ్య చర్చలు ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత, కెనడా ప్రధాని ట్రూడో.. ట్రంప్‌తో భేటీ అయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాక, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు వార్నింగ్ సైన్ ఇచ్చాడు. దాని తర్వాత ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు కూడా తెలిపారు. తన తర్వాత అభ్యర్థిని పార్టీ ప్రకటించే వరకూ ప్రధానిగా ఉంటానని ట్రూడో అన్నాడు. కెనడా రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని ట్రంప్ కెనడాని అమెరికాలో విలీనం చేసుకోవాలనుకుంటుంన్నారని అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో అమెరికా కెనడాలో విలీనం అవ్వడం సాధ్యమేనా.. అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ట్రంప్ మాటలు రాజకీయంగా కౌంటరా లేక, కెనడా దేశ పరిస్థితిని చూసి సెటైర్ వేశాడాని ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విమర్శలు గుప్పించారు. కెనడాను అమెరికాలో విలీనమయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టంచేశారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదు. రెండు దేశాలలోని కార్మికులు, ప్రజలు వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా లాభపడుతున్నారు" అని ట్రూడో రాసుకొచ్చారు. కాగా.. ట్రూడో వ్యాఖ్యలకు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కూడా మద్దతు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కెనడా ఎప్పటికీ వెనక్కి తగ్గదని అన్నారు. కెనడా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు కెనడా విదేశాంగ శాఖమంత్రి. మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మా ప్రజలే మా బలం. ఈ బెదిరింపులకు మేం ఎప్పటికీ వెనక్కి తగ్గమని మెలానీ జోలీ సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. నిపుణులు ఏమంటున్నారంటే.. కెనడా ఓ బలమైన ప్రజాస్వామ్యం దేశం అమెరికా దాన్ని ఆక్రమించుకోవడం సాధ్యం కాదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు. కెనడా అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న స్వతంత్ర దేశమని.. అంత ఈసీగా కెనడా స్వార్వభౌమాధికారాన్ని వదులుకోదని భావిస్తున్నారు. అంతేకాదు.. అమెరికాలో ఉన్న సమైక్య వ్యవస్థ చట్టాల ప్రకారం.. మరో దేశం చేరడం రాజకీయంగా, చట్టంపరంగా చాలాకష్టమని అంటున్నారు నిపుణులు. ఇలాంటి మాటలు ట్రంప్‌కు అలవాటు అని.. ఇంటర్నేషనల్ మీడియా, అనేది దేశాలను ఇలాంటి కామెంట్స్‌తో ట్రంప్ పై అటెన్ష్ పెంచుకుంటారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సెటైర్ అని చాలామంది అనుకుంటున్నారు. ట్రూడో, ట్రంప్ మధ్య ఎన్ని వివాదాలున్నా అమెరికా, కెనడా దేశాల మధ్య భవిష్యత్ పరస్పర సహకారంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.