వన్ ప్లస్ 13 సరీస్ కోసం వేట్ చేసే మొబైల్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఆ కంపెనీ 13 సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ రిలీస్ చేసింది. జనవరి 7న OnePlus 13, 13Rలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాగ్‌షిప్ సెగ్మెట్లో సామ్‌సంగ్, గూగుల్, యాపిల్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 2024లో తీసుకొచ్చిని వన్‌ప్లస్ 12, 12ఆర్‌లలో పోల్చితే కొత్తి టెక్నాలజీ, బెస్ట్ ఫీచర్లు 13 సిరీస్ లో అందుబాటులోకి తెచ్చింది వన్ ప్లస్ కంపెనీ. ఫర్మామెన్స్, డిజైన్ రెండింటిలోనూ 13 సిరీస్ కొత్తగా కనిపిస్తోంది. ఇందులో Google జెమినీ AI ఫీచర్ పొందుపరిచింది పన్ ప్లస్. ఏఐ టెక్ లవర్స్‌ను ఈ ఫీచర్ అట్రాక్ట్ చేస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, వన్‌ప్లస్ అఫీషియల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ సేల్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. 13సిరీస్ వన్ ప్లస్ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. జనవరి 10 సేల్ ప్రారంభమవుతుంది. 12GB RAM, 256GB రూ.69,999, 16GB RAM, 512GB వేరియంట్ రూ. 76,999, 24GB RAM, 1TB వెర్షన్ ధర రూ. 89,999లుగా ఉంది. 13R 12GB RAM, 256GB వేరియంట్‌కు రూ. 43 వేలు, టాప్-టైర్ 16GB RAM,512GB మోడల్ ధర రూ. 49,999లుగా ఉంది. కంపెనీ రూ.3వేలు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 4వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. జనవరి 13 నుంచి అమెజాన్ సేల్ లో అందుబాటులోకి వస్తోంది. Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్ గేర్ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి? వన్ ప్లస్ 13 5G స్పెసిఫికేషన్లు 6.82 ఇంచెస్ 2K, AMOLED డిస్ప్లేక్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్6,000mAh బ్యాటరీ కెపాసిటీ100W సూపర్ వోక్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తోంది.మోడల్‌లో కంపెనీ ఫస్ట్ టైం BOE X2 డిస్‌ప్లే ఇంటర్‌డ్యూస్ చేసింది. అబ్సిడియన్, బ్లూ, వైట్ మూడు రంగుల 13 సిరీస్ లభిస్తుంది.ట్రిపుల్-కెమెరా సెటప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ మెయిన్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. అంతేకాదు 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.15 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 15తో రన్ అవుతూ.. అడిషనల్ గా గూగుల్ జెమినీ ఏఐ వర్క అవుతుంది. Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! వన్ ప్లస్ 13R స్పెసిఫికేషన్స్ 6.78 ఇంచెస్ LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్6,000mAh బ్యాటరీ, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 15తో రన్ అవుతుంది.