USA: మెక్సికో, కెనడా సుంకాలపై వెనక్కు తగ్గిన ట్రంప్
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. టారిఫ్ ల పెంపు కార్యక్రమాన్ని నెలరోజుల పాటూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో కూలాయి.
టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది ఎన్సీఎల్టీ.
చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 22,400 మార్క్ పైన ప్రారంభమైంది.
ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని.. ఏప్రిల్ 2 నుంచి అమలు అవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే దీనిపై స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని అన్నారు.
మహారాష్ట్రలోని ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా సంస్థ మోసానికి పాల్పడిందంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఇది పెద్ద కుంభకోణమని.. విస్తృతమైన దర్యాప్తు చేయాలని పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.