USA: మరోసారి పేలిన ఎలాన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది.  శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో కూలాయి.

author-image
By Manogna alamuru
New Update
usa

Space x Star Ship

ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతి పెద్ద రాకెట్ స్టార్ షిప్ ఈరోజు విఫలమైంది. రోదసిలోకి వెళ్ళాక అక్కడ పేలిపోయింది. డమ్మీ స్టార్ లింక్ శాటలైట్స్ తో భూ కక్ష్యలోని ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా, బహమాస్ దీవుల్లోని  పడ్డాయి. జనాలు ఉన్న స్థలాల్లోనే శకలాలు పడిపోయినప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ జరగలేదు. ఈ వైఫల్యంపై దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ అనౌన్స్ చేసింది.   

జనవరిలో ఒకసారి..

ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్లు ఇంతకు ముందు కూడా పేలాయి. నెలన్నర క్రితం జనవరిలో కూడా ఒక అతి పెద్ద రాకెట్ విఫలమయింది. అప్పుడు కూడా ఇలానే అది పేలింది.  జనవరిలో స్పేస్ ఎక్స్‌కు తాజాగా గట్టిదెబ్బ తగిలింది. ఇది ప్రయోగించిన భారీ రాకెట్ స్టార్ షిప్ ఫెయిల్ అయింది. టెక్సాస్‌లోని బొకా చికా వేదిక నుంచి స్టార్ షిప రాకెట్‌ను స్పేస్ ఎక్స్ ప్రయోగించింది. అయితే ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే పెద్ద శబదం చేస్తూ పేలిపోయింది. సాంకేతిక లోపాల కారణంగానే ఇది పేలిందని సమాచారం.  అలా పేలిన పేలిన రాకెట్ శకలాలు కరేబియన్ సముద్రంలో పడ్డాయి. క్రితంసారి రాకెట్ పేలినప్పుడు తమ ప్రయోగం పూర్తిగా విఫలమయిందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పుడు తాజాగా పేలిన స్టార్ షిప్ కూడా అతి పెద్ద ప్రయోగం. దీన గురించి మరి ఎలాన్ మస్క్ కాని, శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తారో చూడాలి.

Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

Advertisment
తాజా కథనాలు