TS: మహిళా సాధికారతకు పట్టం..ఇందిరా శక్తి మిషన్-2025

ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు  తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటూ టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తీసుకుంది.

New Update
TS Cabinet : ఈనెల 12న మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.!

 మహిళా సాధికారతకు పట్టం కడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025కు  తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలు ఇకనుంచి ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని తీర్మానం చేసింది.  మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు కుదించింది. అలాగే సంఘాల్లో కొనసాగడానికి గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచారు. అలాగే 2024 పారా ఒలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి ప్రభుత్వం ఉద్యోగ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 

టూరిజం పాలసీ..

దాంతో పాటూ పలు నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025 - 2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రాంతాలను ప్రత్యేక టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దడం.. ఆ ప్రాంతాల అభివృద్ధి చేయడంలో 15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులను రాబట్టేలా పాలసీలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించారు. ఇక మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు.  

10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియమించాలని నిర్ణయించారు. పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపు.. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 361 పోస్టులకు అనుమతి.. అలాగే, గురుకులాలకు మరో 330 పోస్టుల భర్తీకి అనుమతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని 4.28 టీఎంసీ నుంచి 1.28 టీఎంసీకి తగ్గించాలని నిర్ణయాలను తీసుకుంది రాష్ట్ర కేబినెట్. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి  నాయకత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని తీర్మానం చేశారు. పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరక్కుండా ఉద్దేశంతో అఖిల పక్ష సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలను కేంద్రానికి నివేదించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు