Kidneys Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ సూపర్ గా పని చేస్తాయి!! శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు By E. Chinni 23 Aug 2023 in లైఫ్ స్టైల్ Scrolling New Update షేర్ చేయండి These foods work super for healthy kidneys, here is details: శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుందాం: కూరగాయల జ్యూస్: డయాలసిస్ చేయించుకునేవారు, అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ కూరగాయల జ్యూస్ లు తాగుతూ ఉంటారు. యాపిల్: యాపిల్ పండ్లలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్, విటమిన్లు అధికంగా లభించే యాపిల్స్ ను రోజూ తింటే కిడ్నీలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. రెడ్ క్యాప్సికమ్: రెడ్ క్యాప్సికమ్ కిడ్నీలకు చాలా మేలు చేస్తుంది. వీటిలో పొటాషియం తక్కువగా ఉంటుంది. రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. విటమిన్స్: విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ లు రెడ్ క్యాప్సికమ్ లో లభిస్తాయి. వీటిలో ఉండే లైకోపిన్ క్యాన్సర్ ను రాకుండా నియంత్రిస్తుంది. ప్రొటీన్స్: కిడ్నీల సమస్యతో బాధపడేవారు ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనను తీసేసి తినడం ఆరోగ్యానికి మంచిది. క్యాలీ ఫ్లవర్: మలినాలను బయటకు పంపేందుకు క్యాలీ ఫ్లవర్ చక్కగా పని చేస్తుంది. శరీరంలో మలినాలను బయటకు పంపే ఇండోల్స్, గ్లూకోసినోలేట్స్, థియోసైనేట్స్ క్యాలీ ఫ్లవర్ లో ఎక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలు: సముద్రపు చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. చేపల్లో ఉండే ప్రొటీన్లు కూడా కిడ్నీలను కాపాడుతాయి. ఫ్రెష్ ఫ్రూట్స్: తాజా పండ్లరసాలు, కూరగాయల రసాలకు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం ఉంటుంది. తద్వార కిడ్నీలు ఎప్పటికప్పుడు శుభ్రమై.. ఆరోగ్యంగా ఉంటాయి. #health-benefits #kidneys #super-foods #vegtables #sea-fish #health-kidneys #health-benefits-for-kidneys #red-capsicum #fresh-fruits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి