Kidneys Health Food: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ సూపర్ గా పని చేస్తాయి!!
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. కిడ్నీలో ఏమైనా తేడా ఉంటే.. కళ్లు ఉబ్బుతాయి. మూత్ర విసర్జన చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేతులు, కాళ్లలో నీరు చేరుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు