TET Free Coaching: ఏపీలో ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు లాంటి మైనారిటీ విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. వారి కోసం టెట్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. వీటి ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు. ఏపీ- టెట్ 2024 కోసం ఉర్దూ, తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వనున్నామని మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ తెలిపారు.
ఈ ఉచిత శిక్షణా శిబిరాలు రాష్ట్రంలో మొత్తం 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. సీఈడీఎం ప్రధాన కార్యాలయం(విజయవాడ), ఆర్ సీఈడీఎం ఏఎం కాలేజ్ (గుంటూరు), ఉస్మానియా కాలేజ్ (కర్నూల్), ఆర్ సీఈడీఎం ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ (విశాఖపట్నం), ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ (గుంటూరు), జోయా కోచింగ్ సెంటర్(నంద్యాల), సీఈడీఎం స్టడీ సెంటర్ (కదిరి), గవర్నమెంట్ యుహెచ్ స్కూల్(రాయదుర్గం), కుట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ (అనంతపురం), ఎంయూహెచ్ స్కూల్ (మదనపల్లె), శ్రీ వెంకటేశ్వర కోచింగ్ సెంటర్ (తిరుపతి), శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ (తిరుపతి), డజలింగ్ టాలెంట్ అకాడమీ, మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ (పొద్దుటూరు), ఆజాద్ కోచింగ్ సెంటర్ (రాయచోటి), గవర్నమెంట్ హై స్కూల్ (కంభం), భావపురి విద్యాసంస్థలు (బాపట్ల), నోబుల్ కాలేజ్ (మచిలీపట్నం), వెంకటసాయి అకాడమీ (కడప)ల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ పోటీ పరీక్షకు ఇలాగే ఉచిత శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని మంత్రి ఫరూక్ చెప్పారు. మైనారీటీల్లో ఆత్మష్పైర్యాన్ని పెపంపొందిచడానికి ఇవి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.