కరీంనగర్‌లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

కరీంనగర్‌ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థుల సమస్యలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి గంగుల కమలాకర్‌ క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.

New Update
కరీంనగర్‌లో ఉద్రిక్తత.. మంత్రి కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్ధి నాయకులు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏబీవీపీ విద్యార్థి నేతలను అరెస్ట్‌ చేసి బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌లకు తరలిచారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు బీఆర్ఎస్ సర్కార్‌ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

విద్యార్థుల హాస్టల్‌ ఫీజ్‌కు సంబధించిన బకాయిలను ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. స్కాలర్‌షిప్‌ను సైతం ఇవ్వలేదని వారు విమర్శించారు. పేరుకే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్యను అంధిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌.. విద్యార్థుల సమస్యలను మాత్రం గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్‌కు విద్యార్థులతో ఎలాంటి పని లేదని అందుకే వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు ఇప్పుడు కావాల్సింది. తన అభ్యర్ధుల గెలుపోటములే అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయన్నారు. 2018లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్‌ కేవలం రెండు సార్లు మాత్రమే పోలీస్‌ నియామక నోటిఫికేషన్లు, ఒక్కసారి మాత్రమే డీఎస్సీ, ఒక్క సారి మాత్రమే గ్రూప్‌ పోస్ట్‌ల నోటిఫకేషన్లు వేశారన్నారు. దీంతో ఐదేళ్లుగా ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులు ఉద్యోగం రాకపోవడం వల్ల నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కసారి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు