JNU : ఎన్నికలకు ముందు జేఎన్యూలో ఏబీవీపీ - వామపక్ష విద్యార్థుల మధ్య ఘర్షణ..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఈ గొడవ జరగగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.