YCP Fourth List: వైసీపీలో నాలుగో జాబితా మీద నేతల్లో టెన్షన్...ఇంకా కొనసాగుతున్న కసరత్తులు

వైసీపీ నాలుగో జాబితా సిద్ధం అవుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ చాలా జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఇప్పటికే మూడు జాబితాలను రిలీజ్ చేసిన చేసిన జగన్.. నాలుగో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.

YCP Focus:  విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!
New Update

YSRCP MLA Candidates Fourth List: గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల లిస్ట్‌లను రెడీ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి కూడా 175 స్థానాలు పైసీపీకే రావాలని పట్టుదలతో ఉన్నారు. దీని కోసం ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎపంఈలకు కూడా ఉద్వాసన చెప్పేస్తున్నారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే... ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తారా లేదా అన్న దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

Also Read: డబుల్ సూపర్ ఓవర్…డబుల్ మజా…వాట్ ఏ మ్యాచ్

ఇంఛార్జులను మార్చేస్తున్న జగన్...

నాలుగో జాబితా విషయంలో అందరికీ టెన్షన్‌గా ఉంది. మూడు జాబితాల్లో 24మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు కలిపి 59 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను (YCP Incharges) మార్చింది వైసీపీ. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడవ జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. ఇప్పుడు నాలుగో జాబితాలో ఇంకెంత మంది పోతారో అని వైసీపీ వర్గాల్లో టెన్షన్ గా ఉంది. నాలుగో లిస్ట్ (Fourth List) కోసం పలువురు ఎమ్మెల్యేలు, నేతల తాడేపల్లి క్యాంపు కార్యాలయం సీఎంవోకు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డితో మంతనాలు జరిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ధనుంజయ రెడ్డి ఎమ్మెల్యేలతో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పుపై చర్చించారు.

బాలినేనికి పిలుపొచ్చింది...

మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మొత్తానికి పిలుపొచ్చింది. జగన్ (CM Jagan) ఈయనకు అప్పాయింట్ మెంట్ ఇచ్చి మాట్లాడారు. మొదట ధనుంజయరెడ్డి, ముఖ్యనేతలతో బాలినేని మంతనాలు జరిపారు. తరవాత సీఎం జగన్‌ని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రకాశం జిల్లాలో తనకు చెప్పకుండా పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చడంపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి ఇంఛార్జుల నియామకం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. కొద్దిరోజులుగా జిల్లాలో ఎవరికీ అందుబాటులో లేకుండా అలిగి హైదరాబాద్‌కి వెళ్ళిపోయిన బాలినేని తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపురావడంతో జగన్ తో సమావేశం అయ్యారు. అయితే బాలినేనికి (Balineni Srinivasa Reddy) ఒంగోలు, గిద్దలూరుల్లో ఏ టికెట్ కావాలో తేల్చుకోమని ఆప్షన్ ఇచ్చిన జగన్ మాగుంటకు మాత్రం టికె్ట ఇచ్చేది లేదని తేల్చి చెప్పారని చెబుతున్నారు. తన టికెట్ విషయంలో నిర్ణయించుకుని చెబుతానని బాలినేని చెప్పినట్టు వైసీపీ వర్గాల సమాచారం.

#elections #politics #ap-elections-2024 #ycp #tickets #cm-jagan #ycp-mla-list
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి