Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం..

అమెరికాలో తెనాలికి చెందిన హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు ఆమె అమెరికాకు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక స్నేహితులతో కలిసి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం..
New Update

America : అమెరికాలోని రోడ్డు ప్రమదాల్లో (Road Accident) భారతీయులు మృతి చెందుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ (Andhra Pradesh) కి చెందిన తెనాలి యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి (Tenali) పట్టణం ఐతానగర్‌లో ఉంటున్న దేవదాయశాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు, నాగమణి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు హారిక (24) గతేడాది పశువైద్యురాలిగా పట్టా అందుకుంది. ఆ తర్వాత అమెరికాలో పశువైద్య విభాగంలో ఎంఎస్‌ చేసేందుకు గత ఏడాది ఆగస్టులో అక్కడికి వెళ్లింది.

Also Read: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌.. ఆమోదించిన జో బిడెన్!

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు ముగించుకుని స్నేహితులతో కలిసి కారులో ఇంటికి బయలుదేరింది. ఇందులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. హారిక వెనుక సీటులో ఉంది. అయితే వాళ్లు వెళ్తున్న దారిలో వారి వాహనం ముందు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిపోయాడు. దీంతో వాళ్లు కారును వెంటనే ఆపారు. వెనకాలే వేగంగా వచ్చిన రెండు, మూడు హారిక ఉన్న కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మిగతావారికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హారిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూతురు మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమ వద్దకు చేర్చాలని కోరుతున్నారు. దీంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) హారిక తండ్రితో ఫోన్‌లో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఆమె మృతదేహాన్ని రప్పించడానికి కృషి చేస్తామని చెప్పారు.

Also read: నేడు విద్యాసంస్థలకు సెలవు!

#andhra-pradesh #telugu-news #road-accident #tenali #usa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe