Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!

గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లాలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.

New Update
Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!

School Holidays In Konaseema District For Two Days : గత కొద్ది రోజులుగా ఏపీ (Andhra Pradesh) వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లా (Konaseema District) లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. గోదావరి నది (Godavari River) ఉద్ధృతి దృష్ట్యా జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఈ మేరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

అటు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం డివిజన్ లో విద్యాసంస్థలకు కూడా మరో రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. గోదావరి నదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద పోటెత్తుతోంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో, దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు.

గత కొన్నిరోజులుగా వరుస అల్పపీడనాలు, వాయుగుండం ఏర్పడడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి.

Also read: 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..!



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు