Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి.

New Update
Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు

Kedarnath Floods: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వరదల్లో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. క్లౌడ్‌ బరస్ట్, భారీ వర్షాల వల్ల నడక మార్గం దెబ్బతింది . కేదార్‌నాథ్‌ను చూసేందుకు వచ్చిన దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. అయితే వాళ్లందరూ సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. గౌరీకుండ్ - కేదార్‌నాథ్ మధ్య 13 చోట్ల నడక మర్గం ధ్వంసమైంది. దీంతో ఎక్కడిక్కడే యాత్రికులు నిలిచిపోగా.. అందులో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు.

Also Read: కొండపై చిక్కుకున్న కుటుంబం.. ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూ టీం

ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి. ముందుగా స్థానికులకే ప్రాధాన్యమివ్వడంతో దూరప్రాంతన ఉన్న యాత్రికులు అక్కడే ఆగిపోయారు. ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేదార్‌నాథ్‌ స్వర్గ రోహిణి కాటేజీలో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను సాయం కోరుతూ మెసేజ్‌ చేశారు. అనంతరం ఆయన ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగంతో మాట్లాడారు. వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ చెప్పారు.


Also Read:  దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు