మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. By Manogna alamuru 18 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచెయ్యరు ఆర్మీలో ఉండే జవాన్లు. అలాంటి వారినే పొట్టన పెట్టుకుంటున్నాయి మణిపూర్ అల్లర్లు. తన కుటుంబ సభ్యులని చూడాలని సెలవు తీసుకుని వచ్చిన ఆర్మీ జవాన్ ను గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమార్చారు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి జవాన్‌ను కిడ్నాప్ చేసి తరువాత చంపేశారు. మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని తరుంగ్ ప్రాంతానికి చెందిన సెర్టో తంగ్తాంగ్ కోమ్(41) దేశ రక్షణలో బాధ్యత వహిస్తున్న సైనికుడు. రీసెంట్ గా సెలవులు పెట్టి ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు.. కోమ్ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. తర్వాత అతడ్ని దారుణంగా కొట్టి కిడ్నాప్ చేశారని సెర్టో తంగ్తాంగ్ కోమ్ 10 ఏళ్ల కొడుకు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కోమ్ ను వెతకడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అతని ఆచూకీ మాత్రం లభించలేదు. మరుసటి రోజు ఖునింగ్‌థెక్ గ్రామ పరిధిలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతి చెందిన జవాన్ కోమ్ ను అధికారులు గుర్తించారు. అతడి తలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని వారు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని వివరించారు. మృతుడు సెర్టో తంగ్తాంగ్ కోమ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. #manipur #killed #india #army #kidnap #jawan #riots మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి