Hyderabad murder : నడిరోడ్డుపై యువకుడి హత్య...టిఫిన్ చేస్తుండగా గొంతుకోసి

పాత కక్షలతో నడిరోడ్డుపై యువకున్ని హత్య చేసిన ఘటన నాగోల్ చౌరస్తాలో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే యువకున్ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేయడంతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. అనంత‌రం దుండ‌గులు అక్కడ నుంచి పారిపోయారు. 

New Update
murder

murder

Hyderabad murder : పాత కక్షలతో నడిరోడ్డుపై యువకున్ని హత్య చేసిన ఘటన నాగోల్ చౌరస్తాలో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే యువకున్ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేయడంతో అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. అనంత‌రం దుండ‌గులు అక్కడ నుంచి పారిపోయారు. 

ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
 
పోలీసుల క‌థ‌నం మేర‌కు హత్యకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పంగా  మ‌నోజ్‌, జయపురి కాలనీకి చెందిన సంజయ్ చాలా కాలంగా స్నేహితులు. అయితే 2023 ఏప్రిల్‌లో మనోజ్, సంజయ్‌కి మధ్య గొడవ‌లు చోటు చేసుకున్నాయి. ఈ గొడవల సమయంలో సంజ‌య్‌పై మ‌నోజ్ క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఈ విషయమై ఎల్‌బీ న‌గ‌ర్ పోలీస్ స్టేషన్‌లో మ‌నోజ్‌పై కేసు న‌మోదైంది. కాగా సంజ‌య్, మ‌నోజ్ కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చల్లో భాగంగా కేసును ఉప‌సంహ‌రించుకున్నారు. సంజ‌య్ రూ. 3 ల‌క్షలు తీసుకుని కేసు వెన‌క్కు తీసుకున్నాడు. కేసు అక్కడితో అయిపోయిందనుకున్నప్పటికీ సంజయ్ మాత్రం మనోజ్‌పై కక్ష పెంచుకుని అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. 

 Also Read: CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు

ఈ క్రమంలోనే నాగోల్‌లో ఉంటున్న మనోజ్, తన స్నేహితుడు బందెల వంశీ తో కలిసి శనివారం రాత్రి 1:50 గంటలకు నాగోల్ ఫ్లైఓవర్ యు-టర్న్ దగ్గర ఉన్న రాజుగారి బిర్యాని హోటల్ ముందు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న మొబైల్ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్దకు వ‌చ్చారు. వంశీ, మనోజ్ యాక్టివాపై కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. కాగా అవకాశం చూస్తున్న సంజయ్, తన స్నేహితుడు మహేష్, మరో స్నేహితుడు మొత్తం ముగ్గురు కలిసి ఒక పల్సర్ బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. టిఫిన్ చేస్తున్న మ‌నోజ్‌పై సంజ‌య్ అత‌ని స్నేహితులు క‌త్తితో విచ‌క్షణర‌హితంగా దాడి చేశారు. కింద‌ప‌డిపోయిన మ‌నోజ్‌పై కూర్చుని.. క‌త్తితో గొంతు కోశాడు సంజ‌య్.

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

మ‌నోజ్‌ను ప్రాణాల‌తో కాపాడేందుకు య‌త్నించిన వంశీపై కూడా సంజ‌య్ క‌త్తితో పొడిచాడు. దీంతో వంశీ ఎడ‌మ చేతికి తీవ్ర గాయ‌మైంది. అనంతరం ఆ ముగ్గురు అక్కడినుంచి పారిపోయారు. కాగా ఈ సంఘటన చూస్తున్నవారు భయంతో పరుగుతు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ర‌క్తపు మ‌డుగులో ప‌డి ఉన్న మ‌నోజ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.  దీంతో మ‌నోజ్ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి త‌ర‌లించారు. చైత‌న్యపురి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు