BIG BREAKING: బీఆర్ఎస్ MLAకు మహిళా కమిషన్ సమన్లు

ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు పంపింది. మహిళా కార్పొరేటర్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై మార్చి 27న కమిషన్ ముందు హాజరై కావాలని నోటీసులు ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు హనీమూన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.

New Update
BRS MLA sudheer reddy

BRS MLA sudheer reddy Photograph: (BRS MLA sudheer reddy)

BIG BREAKING: LBనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మార్చి 27న కమిషన్ ముందు హాజరు కావాలని ఉమెన్ కమిషన్ ఛైర్మన్ నేరళ్ల శారద నోటీసులు ఇష్యూ చేశారు. ఇదే వివాదంపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. 

Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

Also read; Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!

ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల వెనుక కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఉన్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి మధ్య హనీమూన్ నడుస్తుందంటూ సంచలనం రేపారు. అంతేకాదు హస్తినాపురం కార్పొరేటర్‌తో కూడా హనీమూన్ నడుస్తుందనడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ సుధీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.

Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది

మార్చి 12న మన్సూరాబాద్ డివిజన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేయగ వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేసిన తర్వాత మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు శాంతింపజేశారు. కొద్దిసేపటి తర్వాత ఎల్బీనగర్ డివిజన్ లో మరోచోట శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. పోలీసులు  అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ సమయంలో రఘువీర్ రెడ్డితో పాటు కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలవగా ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్లి బీఆర్ఎస్ ​నేతలను పరామర్శించారు. వారిని తీసుకుని డీసీపీ ఆఫీసుకు వెళ్లి ఇష్యూ గురించి వివరించారు. 

Also read: Mobile blast : ఆగమైపోయిన అరవింద్.. జేబులో ఫోన్ పేలి యువకుడి ప్రైవేట్ పార్ట్ బ్లాస్ట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు