Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!

ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సిగ్గుచేటని, బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు.

New Update
lb nagar mla

lb nagar mla Photograph: (lb nagar mla)

Hyderabad:  బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇష్యూలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని సుజాత వర్గం డిమాండ్ చేస్తోంది. 

సిగ్గు, శరం ఉందా?

ఈ ఇష్యూపై స్పందించిన కాంగ్రెస్ నేత మధుయాష్కీ.. సుధీర్ రెడ్డి సిగ్గు, శరం ఉందా? అని ప్రశ్నించారు. 'నీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. సిగ్గు ఉందా? మహిళా కార్పొరేటర్ సుజాతపై నీచంగా మాట్లాడుతావా? మంత్రులు కొండా సురేఖ, సీతక్కపై కూడా అనుచితంగా మాట్లాడుతారా. మీ నాయకుడు కేటీఆర్ఎ ఏం మాట్లాడుతున్నారు. మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం. కేసీఆర్, కేటీఆర్ ఏం చేస్తున్నారు. రౌడీ మూకలతో దౌర్జన్యానికి దిగినే ఊరుకోం. సుజాత నా సోదరి సమానురాలు. మీ భార్య కూడా నాకు సోదరిలాంటిదే. నీ లాంటి చిల్లర మాటలు, రాజకీయాలు చేసే అలవాటు నాకు లేదు. ఎల్బీ నగర్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా. మహిళలపై గౌరవం ఉంటే బీఆర్ఎస్ పార్టీ సుధీర్ ను సస్పెండ్ చేయండి' అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 

అసలేం జరిగిందంటే..

మార్చి 12న మన్సూరాబాద్ డివిజన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేయగ వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేసిన తర్వాత మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు శాంతింపజేశారు. కొద్దిసేపటి తర్వాత ఎల్బీనగర్ డివిజన్ లో మరోచోట శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. పోలీసులు  అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ సమయంలో రఘువీర్ రెడ్డితో పాటు కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలవగా ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి పోలీస్ స్టేషన్ వెళ్లి బీఆర్ఎస్ ​నేతలను పరామర్శించారు. వారిని తీసుకుని డీసీపీ ఆఫీసుకు వెళ్లి ఇష్యూ గురించి వివరించారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల వెనుక కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఉన్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి మధ్య హనీమూన్ నడుస్తుందంటూ సంచలనం రేపారు. అంతేకాదు హస్తినాపురం కార్పొరేటర్ ​తో కూడా హనీమూన్ నడుస్తుందనడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ సుధీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు