MLA Sudheer Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత.. కేటీఆర్ పరామర్శ
TG: అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.