ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగిన గ్రూప్ -2 పరీక్షలు ముగిశాయి. అయితే నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్షలు రాశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ నాగర్ కర్నూల్ పట్టణంలోని ZP ఉన్నత పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి దీంతో అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ రేవతి ఇందుకు ఒప్పుకోలేదు. పరీక్ష రాస్తానని చెప్పారు. అంతేకాదు ఆమెకు ప్రసవం తేదీ కూడా సోమవారమే కావడంతో అక్కడున్న వాళ్లు ఆందోళనకు గురయ్యారు. Also Read: Maharashtra లో మంత్రివర్గ విస్తరణ.. 39 మంది MLAలు మంత్రులుగా ప్రమాణం అయినప్పటికీ కూడా ఆమె పరీక్ష రాస్తానని చెప్పింది. దీంతో అధికారులు జిల్లా కలెక్టర్ సంతోష్‌కు ఈ విషయం చెప్పారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం పరీక్ష కేంద్రంలో 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆమెకు నొప్పులు ఎప్పుడు తీవ్రమైనా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచారు. పట్టువదలకుండా రేవతి పరీక్ష రాశారు. ఆమె భర్త, తల్లి కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు. Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం Also Read: మార్చి 5 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!