Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వాన్ని పడగొడుతామంటే ఊరుకుంటామా?  : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా  పార్ట్ -బి లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  తెలిపారు.

New Update
Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా  పార్ట్ -బి లో పెట్టిన 18 లక్షల ఎకరాలలో ఆరు నుంచి ఏడు లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని ఈ భూములకు ఈ భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామని  రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి  తెలిపారు. శుక్రవారం ములుగు జిల్లా  వెంకటాపూర్ లో మంత్రులు కొండ సురేఖ,  సీతక్క(Minister Seethakka)తో కలిసి భూభారతి(Bhu Bharathi) పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు . త‌ర్వాత  ఆదిలాబాద్  జిల్లా భోర‌జ్ మండ‌లం పుసాయ్ గ్రామంలో భూభారతి చట్టంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పేదల కన్నీటిని తీర్చేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఎన్నికలకు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేము ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించి ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా పనిచేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రైతులకు సేవలు అందిస్తాం. రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని ఇప్పుడు ఇంకా ఆ అవసరం రైతులకు లేదని అధికారులే రైతుల వద్దకు వచ్చి వారి భూ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. 

Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!

ధరణిపై గత పాలకులు ఏనాడు కూడా రెవెన్యూ సదస్సు పెట్టలేదని ఒకవేళ రెవెన్యూ సదస్సులు పెట్టి ఉంటే ఆనాడే ఆ ప్రభుత్వం పై ప్రజలు తిరగబడేవారన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పులను ఇప్పటికీ గ్రహించడం లేదని వారికి జ్ఞానోదయం కావడం లేదన్నారు.గ‌తంలో గులాబీ ద‌ళం కోసం కేసీఆర్ 2020- ధ‌ర‌ణి చ‌ట్టాన్ని తీసుకువ‌స్తే మేం దాన్ని బంగాళాఖాతంలోకి విసిరేసి సామాన్య ప్రజ‌ల కోసం 2025- భూ భార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామన్నారు. రాష్ట్రంలో ఇంత‌వ‌ర‌కు డాక్యుమెంట్లు లేని అబాదీ ఇల్లు అని పిలుచుకునే నివాస‌గృహాలకు డాక్యుమెంట్లు ఇచ్చే దిశ‌గా చ‌ర్యలు చేప‌డుతున్నామని పొంగులేటి వివరించారు.

Also Read: TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి

 ధ‌ర‌ణి ద‌ళారులు, గులాబీ పార్టీ గులాములు ఇచ్చే డ‌బ్బుతో ఇందిర‌మ్మ ప్రభుత్వాన్ని ప‌డ‌గొడితే మీరు ఊరుకుంటారా?  అని మంత్రి పొంగులేటి ప్రశ్నించ‌గా ఊరుకోం అని ప్రజ‌ల నుంచి స్పంద‌న వ‌చ్చింది. భూ భార‌తి స‌మ‌స్యల ప‌రిష్కారానికి గాను త‌మ కార్యాల‌యం, సిసిఎల్ఎ కార్యాల‌యానికి అనుసంధానించే టోల్‌ఫ్రీ నెంబ‌రును త్వర‌లో ప్రజ‌ల‌కు తెలియ‌జేస్తామన్నారు. గిరిజ‌న‌, గిరిజ‌నేతరులు ఉండే ప్రాంతంలో భూ స‌మ‌స్యల శాశ్వత‌ ప‌రిష్కారానికి  కేంద్రప్రభుత్వ నిబంధ‌న‌లకు లోబ‌డి   ఒక క‌మిటీని నియ‌మిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు