/rtv/media/media_files/2026/01/07/trump-2026-01-07-09-47-31.jpg)
Trump discussed Greenland acquisition, military option open, White House
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది. అంతేకాదు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు మిలటరీని కూడా వినియోగించే ఆప్షన్‌కు కూడా పెట్టుకున్నట్లు పేర్కొంది. అర్కిటిక్‌లో భౌగోళిక రాజకీయ పోటీ పెరగడంతో గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడాన్ని ట్రంప్ అమెరికా జాతీయ భద్రత ప్రాధాన్యతగా చూస్తున్నారని తెలిపింది.
Also Read: అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా
గ్రీన్‌లాండ్ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన దీవి అయినప్పటికీ డెన్మార్క్ భూభాగంలో ఉంటుంది. ఇక్కడ కేవలం 57 వేల మంది నివసిస్తున్నారు. గతంలో కూడా అమెరికా ఈ ప్రాంతాన్ని దక్కించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ డెన్మా్ర్క్ మాత్రం తిరస్కరించింది. ఈ ద్వీపాన్ని ఎవరికీ అమ్మేది లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్ దీనిగురించి ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలో డెన్మార్క్‌తో పాటు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశం కావాలని తాము కోరినట్లు గ్రీన్‌లాండ్ తెలిపింది.
Also Read: నాడు పాక్, నేడు వెనెజువెలా.. చైనా వెపన్స్ మళ్లీ ఫెయిల్.. కారణం ఏంటి?
గ్రీన్‌లాండ్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి చర్చిండమే ఈ సమావేశం ఉద్దేశమని విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్డ్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. 2025లో మంత్రివర్గ స్థాయిలో సమావేశం కావాలని గ్రీన్లాండ్, డానిష్ ప్రభుత్వాలు అభ్యర్థించినప్పటికీ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు వీలుకాలేదని పేర్కొన్నారు. మరోవైపు గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు సాధ్యమైన మార్గాలను ట్రంప్, ఆయన సలహాదారులు సమీక్షిస్తున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. అయితే తాజాగా దీనికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేసింది.
Follow Us