/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
murder
ప్రభుత్వ ఉద్యోగం (Government Job) కోసం భర్తను భార్య హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ పట్టణంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ కనగల్ మండలం పరిధిలోని చర్లగౌరారంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
కొడుకు మృతిపై అనుమానం...
గత నెల 25న మూర్ఛ వచ్చి కిందపడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. ఈ మేరకు అతని భార్య అక్సహ్ జహ ఫిర్యాదు ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి మహ్మద్ బేగం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని చెప్పడంతో అదే రోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నెల 7న పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తలకు బలమైన గాయం అయినట్లు తేలింది. దీంతో భార్య అక్సర్ జహను అదుపులోకి తీసుకుని విచారించారు.
2007లో వివాహం (Marriage) జరిగి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మద్యానికి బానిసయ్యాడని, నిత్యం వేధిస్తుండటంతో అడ్డు తొలగించుకోవడంతో పాటు తనకు లేదా పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించినట్లు తెలిపింది. దీంతో తలపై కొట్టినట్లు అందువల్లే తను మరణించాడని చెప్పింది. కేసు ఛేదించిన సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై శంకర్‌లను డీఎస్పీ అభినందించారు.