/rtv/media/media_files/2025/01/29/UW4aE29IE9O8UPb6dOLt.jpg)
Allu arjun Sandhya theatre stampede sri tej health bulletin
Sandhya Theater Stampede: అల్లు అర్జున్ పుష్ప2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. అతడి తల్లి ప్రాణాలు కోల్పోయింది. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ కి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గత నెలరోజుల్లో ఒకటి, రెండు రోజులు మినహా మిగతా టైం లో శ్రీతేజ్ వెంటిలేటర్ సహాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. 10 రోజుల క్రితం ఆహారాన్ని అందించాడనికి ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ద్వారా పొట్టలోని ట్యూబ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: AI Music Video: అబ్బా భలే ఉంది..ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం AI-జనరేటెడ్ పాట
కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదు
కానీ నరాలు, మెదడు పనితీరులో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదని వైద్యులు తెలిపారు. ఇప్పటికీ శ్రీతేజ్ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదని.. సైగలు, మాటలు కూడా అర్థం చేసుకోవడం లేదని వివరించారు. నాడీ సంబంధిత సమస్యల కారణంగా తల భాగాన్ని పైకి ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!
ఇది ఇలా ఉంటే తొక్కిసలాట ఘటనకు పరోక్షంగా కారణమైన హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేయగా.. ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చారు. శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే అతడు కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందిస్తామని శ్రీతేజ్ కుటుంబానికి భరోసా ఇచ్చారు అల్లు అర్జున్.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!