చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్

ఎమ్మెల్సీ సీటు దక్కడంపై  బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు కీలక కామెంట్స్ చేశారు.  2014లోనే తనకు మంత్రి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తాను తిరస్కరించానని తెలిపారు.  ఇక మాజీ సీఎం జగన్ తో తనకు రహస్య స్నేహం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.

author-image
By Krishna
New Update
somu veerraju bjp

ఎమ్మెల్సీ సీటు దక్కడంపై  బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు కీలక కామెంట్స్ చేశారు.  2014లోనే తనకు మంత్రి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తాను తిరస్కరించానని తెలిపారు.  ఇక మాజీ సీఎం జగన్ తో తనకు రహస్య స్నేహం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.  తనకు జగన్ సీఎం అయ్యేవరకు పరిచయం కూడా లేదని.. ఒకే ఒక్కసారి కౌన్సిల్ లో కలిసినట్లుగా వెల్లడించారు. ఎమ్మెల్సీ టికెట్ కోసం తాను ఎలాంటి లాబీయింగ్ చేయలేదని అన్నారు సోము వీర్రాజు. 

Also read :  AP Weather: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త

వ్యతిరేకించానన్నది అవాస్తం

నామినేషన్ పత్రాల కోసం స్పెషల్ ప్లైట్స్ వాడటం అనేది పార్టీ నిర్ణయమేనని స్పష్టం చేశారు.  ఇక చంద్రబాబును, అమరావతిని తాను వ్యతిరేకించానన్నది అవాస్తమన్నారు. మోదీ,చంద్రబాబు మధ్య ఎలాంటి బంధం ఉందో తనకు చంద్రబాబుతో కూడా అలాంటి బంధమే  ఉందన్నారు.  కాగా నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడంతో  సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు.  

Also read :  ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను స్క్రూడ్రైవర్ తో పొడిచి.. ఆపై కత్తితో ఘోరం..

కాగా 2014, 19 వరకు  ఎమ్మెల్సీగా పనిచేశారు సోము వీర్రాజు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.  అనంతరం దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన స్థానంలో అధ్యక్షురాలిగా హైకమాండ్  నియమించింది.  ఏపీలో ఖాళీగా కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ నుంచి ముగ్గురికి, జనసేన పార్టీకి, బీజేపీలకు ఒక్కొక్కటి దక్కాయి.  జనసేన అభ్యర్థిగా నాగబాబును ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ (ఎస్టీ), బీద రవి చంద్ర(బీసీ), బీటీ నాయుడు (బీసీ) పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. 

Also Read :  గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు...  హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!

Also read : ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు