కర్వా చౌత్ రోజున ఉపవాసం ఎందుకో తెలుసా? ఈ పూజ చేస్తే భర్తలకు ఏమవుతుంది? కర్వా చౌత్ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం కర్వా చౌత్ అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ఈ వేడుక ప్రాముఖ్యత, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 17 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 కర్వా చౌత్ వేడుకను జరుపుకునే సంప్రదాయం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఏడాది కర్వా చౌత్ అక్టోబరు 20న ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుక ప్రాముఖ్యత? ఎప్పుడు జరుపుకోవాలి? ఎందుకు జరుపుకుంటారు? సరైన ముహూర్తం ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం... 2/6 వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం కర్వా చౌత్ ఉపవాసాన్ని చేస్తారు. వివాహిత మహిళతో పాటు అమ్మాయిలు కూడా కాబోయే జీవిత భాగస్వాముల కోసం కూడా ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఉపవాస సమయంలో మహిళలు శివుడు, పార్వతి దేవి, కార్తికేయ, వినాయకుడు, పార్వతీ దేవిని పూజిస్తారు. 3/6 కర్వా చౌత్ రోజున మహిళలు ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకు ఏమీ తినకుండా, త్రాగకుండా ఉపవాసం ఉంటారు. సాయంకాలం చంద్రుని దర్శనం తర్వాత భర్త మొహాన్ని జల్లెడలో చూసి.. భర్త చేతుల మీదుగా స్త్రీలు ఉపవాసాన్ని విరమిస్తారు. 4/6 కర్వా చౌత్ ఎప్పుడు? జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కార్తీక కృష్ణ చతుర్థి తిథి ప్రారంభం: అక్టోబర్ 20న ఉదయం 6:46 గంటలకు కార్తీక కృష్ణ చతుర్థి తిథి ముగింపు: అక్టోబర్ 21 ఉదయం 4:16 గంటలకు కర్వా చౌత్ ఉపవాస సమయం: ఉదయం 6:25 నుంచి 7:54 వరకు కర్వా చౌత్ పూజ ముహూర్తం: సాయంత్రం 5:46 నుంచి 7:02 వరకు కర్వా చౌత్ రోజున చంద్రోదయ సమయం: సాయంత్రం 7:54 pm. 5/6 కర్వా చౌత్ ప్రాముఖ్యత కర్వా చౌత్ వేడుక భార్యాభర్తల ప్రేమ, వైవాహిక జీవితానికి సంబంధించినది. భర్త క్షేమం, ఆయు ఆరోగ్యాల కోసం స్త్రీలు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఇతిహాసాల ప్రకారం సావిత్రి తన భర్త యొక్క ఆత్మ కోసం మృత్యుదేవత అయిన యముడిని ఈ ఉపవాస దీక్షతో వేడుకుంటుంది. 6/6 వివాహిత స్త్రీలు భర్తల శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం కఠినమైన ఉపవాసాన్ని పాటించడమే కర్వా చౌత్ ముఖ్య ఉద్దేశం. ఉత్తర భారతదేశంలో, మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ వేడుకకు ప్రాముఖ్యత ఉంటుంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి