Warangal: 2050 విజ‌న్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!?

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్లాన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. 

ed dfd
New Update

Warangal: గొప్ప చారిత్రక నేప‌థ్యమున్న వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ప్లాన్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే విడుద‌ల చేస్తార‌ని తెలిపారు. ఈ మేరకు మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఎమ్.సి.హెచ్.ఆర్.డీ లో వ‌రంగ‌ల్, హ‌న్మకొండ జిల్లాల‌ అభివృద్ది కార్యక్రమాల‌పై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్‌, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. 

ఇది కూడా చదవండి: కాఫీలో పంచదార వేసుకోకపోతే ఇన్ని లాభాలా?

హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా..

ఈ స‌మావేశంలో నూత‌న మాస్టర్ ప్లాన్, వ‌రంగ‌ల్ ఇన్నర్ రింగ్ రోడ్‌, ఔట‌ర్ రింగ్ రోడ్‌, భ‌ద్రకాళి టెంపుల్ అభివృద్ది, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్‌, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో ప్రధానంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వరంగ‌ల్ న‌గ‌రాన్ని అభివృద్ది ప‌ర‌చాల‌నే కృత‌నిశ్చయంతో ఉన్నామన్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వ‌రంగ‌ల్ మాస్టర్ ప్లాన్‌ త‌మ ప్రభుత్వం కొలిక్కి తీసుకువచ్చింద‌ని అన్నారు. అభివృద్ది ప‌నుల వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔట‌ర్ రింగ్ రోడ్‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. 41 కిలోమీట‌ర్ల ప‌రిధి ఉన్న వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డును మూడు ద‌శ‌ల్లో చేప‌ట్టాల‌ని, మొద‌టి ద‌శ‌లో 20 కిలో మీట‌ర్లు, రెండ‌వ ద‌శ‌లో 11 కిలోమీట‌ర్లు, మూడ‌వ ద‌శలో 9 కిలోమీట‌ర్లు చేప‌ట్టాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: బతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్

ఏ రాష్ట్రంలో లేని ఎయిర్‌పోర్ట్.. 

హైద‌రాబాద్ మిన‌హా రాష్ట్రంలో మ‌రెక్కడా ఎయిర్‌పోర్ట్ లేద‌ని వ‌రంగ‌ల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ రాబోతోంద‌ని, వీలైనంత త్వర‌గా ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌ను ప్రారంభించి ఏడాదిలోపు ప్రజ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 382 ఎక‌రాల ప‌రిధిలో ఉన్న చారిత్రాత్మక‌మైన భ‌ద్రకాళి చెరువులో పేరుకుపోయిన పూడిక‌ను తీయాల‌ని, ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను రేప‌టినుంచే మొద‌లు పెట్టాల‌ని, ప్రజ‌ల‌కు ఇబ్బంది లేకుండ చెరువును ఖాళీ చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ చెరువు 40 శాతం గుర్రపుడెక్కతో నిండిపోయింద‌న్నారు. మెగా టెక్స్ టైల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన కంపెనీలు త‌ప్పనిస‌రిగా స్దానికుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులకు తెలిపారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప‌నుల‌ను వీలైనంత త్వర‌గా ప్రారంభించేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: Imane Khelif: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్‌

ఈ స‌మావేశంలో పార్లమెంటు స‌భ్యురాలు క‌డియం కావ్య, శాస‌న‌స‌భ్యులు క‌డియం శ్రీ‌హ‌రి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె.నాగ‌రాజు, నాయిని రాజేంద‌ర్, ఎమ్మెల్సీ బ‌స్వరాజు సార‌య్య, వ‌రంగ‌ల్ మేయ‌ర్ శ్రీ‌మతి గుండు సుధారాణి, సిఎం ప్రత్యేక కార్యద‌ర్శి బి. అజిత్ రెడ్డి, ఎం.ఎ.యూ.డి. ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ దాన కిశోర్‌, రోడ్లు , భ‌వ‌నాల కార్యద‌ర్శి   శ్రీ‌మ‌తి హ‌రిచంద‌న‌, హ‌నుమ‌కొండ, వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్టర్లు స‌త్యశార‌ద‌, పి. ప్రావీణ్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  ఒక్కసారిగా సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్.. లాభాల్లో సూచీలు

#warangal #minister-ponguleti-srinivas #master-plan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe