Kishan Reddy: ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు
ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా నాయకురాలిని పోలీసులు ఈడ్చుకెళ్లడం ఎంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మహేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.