Volcanic Eruption: పేలిపోయిన అగ్నిపర్వతం.. 9 మంది మృతి

ఇండోనేషియాలోని మౌంట్‌ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సమీపంలోని ఈ గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించారు.

New Update
Volcano

ఇండోనేషియాలోని మౌంట్‌ లెవొటోబి లకిలకి అనే అగ్నిపర్వతం పేలిపోయింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోర్స్‌ దీవిలోని మౌంట్‌ లెవొటోబి లకిలకిలో విస్పోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి అగ్నిపర్వతం ప్రతీరోజూ దాదాపు 2 వేల మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విస్పోటనాలు డేంజర్‌ జోన్‌ను కూడా దాటిపోయాయని చెప్పారు. అయితే అగ్నిపర్వతం మందంపాటి బూడిదను వెదజల్లుతుండటం వల్ల ఆ వేడి బుడిద పడి దగ్గర్లో ఉన్న పలు నివాసులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.  

Also Read: దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది!

Indonesia

వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) సెంటర్ ప్రతినిధి హడి విజయ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నపర్వతం విస్ఫోటనం చెందడం వల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటం వల్ల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురువుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Also Read: బాలుడి కడుపులో 56 వస్తువులు.. షాకైన వైద్యులు.. చివరికీ

ఇదిలాఉండగా మరోవైపు ఇండోనేషియాలోని అనేక ప్రాంతాల్లో వరసుగా అగ్నిపర్వతాలు బద్ధలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా ప్రకటించామని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో హల్మహెరా ద్వీపంలో ఇబు పర్వతం విస్ఫోటనం చెందింది. ఈ విషాధ ఘటనలో 60 మందికి పైగా మరణించారు. అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న ఏడు గ్రామాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. 

Also Read: సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్

Also Read: తెలంగాణలో ఈరోజు టెట్‌ నోటిఫికేషన్‌.. పరీక్షలు ఎప్పటినుంచంటే ?

Advertisment
తాజా కథనాలు